బయన పల్లెలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న డిసిసి బ్యాంకు చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు

బద్వేల్ ప్రజావాణిన్యూస్(మార్చి27)బయనపల్లెలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.శ్రీరాముడి ఆలయంలో కొత్తగా ధ్వజస్తంభ స్థాపనతో పాటు ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నట్లు గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.గుడి అభివృద్ధికి పాటుపడుతున్న గ్రామ పెద్దలను ప్రజలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. తన వంతు సాయం గా 10016/- విరాళంగా ఇచ్చారు. ఆలయంలో దర్శనం అనంతరం టిడిపి నాయకులు శివయ్య,భైసాని సురేందర్ రెడ్డి,నాగిరెడ్డి భాస్కర్ రెడ్డి డిసిసి బ్యాంక్ చైర్మన్ కు తీర్థప్రసాదాలు అందించి శాలువతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో టిడిపి...