బద్వేల్: శ్రీ సత్యసాయి పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే – బాల వికాస్ శిక్షణే విద్యార్థుల విజయ రహస్యం
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) బద్వేల్:స్థానిక శ్రీ సత్యసాయి విద్యా సంస్థలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే మరియు పాదపూజ కార్యక్రమంలో బాల వికాస్ తరగతుల ప్రాముఖ్యతను ప్రత్యేకంగా ప్రస్తావించారు.బాల వికాస్ తరగతుల వల్ల కలిగే ప్రయోజనాలు:ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మరియు అతిథులు మాట్లాడుతూ,ప్రతి ఆదివారం పాఠశాలలో నిర్వహించే బాల వికాస్ తరగతులు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నాయని తెలిపారు.విలువల విద్య:కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా.సత్యం,ధర్మం,శాంతి,ప్రేమ,అహింస అనే పంచ సూత్రాలను బాల వికాస్ ద్వారా విద్యార్థులు వంటబట్టించుకుంటున్నారు.నైతిక వికాసం చిన్నతనం నుండే ప్రార్థనలు,శ్లోకాలు,మరియు...