prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 8:55 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బద్వేల్ లో సోలార్ ఎంటర్ప్రైజెస్’ను ప్రారంభించిన మైదుకూరు ఎమ్మెల్యే.

నేడు బద్వేల్ మున్సిపాలిటీ ఎన్జీవో కాలనీలో, మైదుకూరు నియోజకవర్గం బోడపాడు గ్రామానికి చెందిన ప్రముఖులు శ్రీ బిజివేముల రామిరెడ్డి గారి ఆహ్వానం మేరకు.. మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు మరియు బద్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ కే రితేష్ రెడ్డి గారు కలిసి వారి నూతన ‘విహాన్ సోలార్ ఎంటర్ప్రైజెస్’ను రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా పర్యావరణ హితమైన సోలార్ ఇంధన రంగంలోకి అడుగుపెట్టిన రామిరెడ్డి గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు నాయకులు శుభాకాంక్షలు తెలిపి, సంస్థ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షులు గుర్రంపాటి వెంగల్ రెడ్డి గారు, మాజీ ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్ మహబూబ్ బాషా గారు, నరసింహనాయుడు గారు, రామ్మోహన్ రెడ్డి గారు మరియు ఉభయ నియోజకవర్గాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.