బద్వేల్ మున్సిపాలిటీ ప్రజలకు ముఖ్య గమనిక: ఎండ తీవ్రత పట్ల అప్రమత్తత

బద్వేల్ ప్రజావాణిన్యూస్(మార్చి30)రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.ఈ తీవ్రమైన వడగాల్పుల దృష్ట్యా, పౌరులందరూ ఈ క్రింది జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నాము.ముఖ్యమైన సమయాలు:ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. ​ప్రత్యేకించి బహిరంగ ప్రదేశాల్లో తిరగడం నివారించండి.వాహనదారులకు సూచనలు:ఎండ వేడికి కారు లోపల ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతుంది.కాబట్టి మీ కార్లలో ఇవి ఉంచకండి:వద్దు:గ్యాస్ లైటర్లు,పర్ఫ్యూమ్ బాటిళ్లు,కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్, బ్యాటరీలు ​పెట్రోల్ ఇంధన ట్యాంక్‌ను పూర్తిగా నింపకండి.సాయంత్రం వేళల్లోనే ఇంధనం...