కడప జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్18) బద్వేల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన (స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర) కార్యక్రమంలో భాగంగా ఈ నెల మూడవ శనివారం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగులచెరువు గట్టు వద్ద “జలధార జలహారతి” థీమ్‌తో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో బద్వేల్ రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు బద్వేల్ పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్ శ్రీ ఏ.చంద్ర మోహన్,మున్సిపల్ కమీషనర్ శ్రీ వి.వి.నరసింహా రెడ్డి, బద్వేల్ తహసీల్దార్ శ్రీ ఎస్.పీర్ మున్ని,ఎక్సైజ్ సీఐ శ్రీ సీతారాం,శ్రీ నయీమ్,వారి సిబ్బంది మరియు ఇతర శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృథాగా పోయే వాన నీటిని భూగర్భంలోకి మళ్లించడం ద్వారా భూగర్భ జల మట్టాన్ని పెంచే విధానాలపై అవగాహన కల్పించారు.అలాగే ప్రతి ఇంటిలో ఇంకుడు గుంట నిర్మించుకోవడం ద్వారా నీటి ఎద్దడిని నివారించవచ్చని తెలిపారు.చెరువులు,కుంటలు వంటి జల వనరులను కాపాడుకోవడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని అధికారులు సూచించారు.కార్యక్రమంలో మున్సిపల్,సచివాలయ,మెప్మా సిబ్బంది మరియు స్థానిక ప్రజలు కలిసి నీటి సంరక్షణ మరియు పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేశారు.పురపాలక కార్యాలయం,