బద్వేల్ మున్సిపాలిటీలో వైసీపీకి భారీ షాక్: టీడీపీలోకి చేరిన 40 కుటుంబాలు!

బద్వేల్,(జూలై 26 ప్రజావాణి) నియోజకవర్గంలో  రాజకీయ సమీకరణాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. నియోజకవర్గ వైసీపీ విభాగంలో తీవ్ర కుదుపు మొదలైంది.తాజాగా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డుకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) లోకి చేరారు. మంచూరి సూర్యనారాయణ రెడ్డి బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి నియోజకవర్గంలో సరికొత్త రాజకీయ జోష్ కనిపిస్తోందని, ఆయన నాయకత్వంపై నమ్మకంతోనే ప్రజలు,నాయకులు స్వచ్ఛందంగా టీడీపీ వైపు...