బద్వేల్ మున్సిపాలిటీలో ప్రమాదకరంగా మారిన డ్రైనేజీలు: కల్వర్టు లేక స్థానికుల తీవ్ర ఇబ్బందులు

బద్వేల్ జూలై 13 ప్రజావాణి మున్సిపాలిటీ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనపై మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కొట్టచ్చినట్లు కనిపిస్తోంది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో కల్వర్టులు లేక స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దెబ్బతిన్న డ్రైనేజీలపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఇనుప పలకలు (ఐరన్ షీట్లు) ఇప్పుడు ప్రాణసంకటంగా మారాయి.ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని పాదచారులు,వాహనదారులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తాత్కాలిక పలకలతో ప్రమాదకర పరిస్థితిమురుగు నీటి కాలువలపై శాశ్వత కల్వర్టులు నిర్మించాల్సిన అధికారులు,కేవలం తాత్కాలికంగా ఇనుప పలకలను వేసి చేతులు దులుపుకున్నారు.ప్రస్తుతం ఈ పలకలు...