prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 12:25 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బద్వేల్ పురపాలక సంఘం పరిధిలో ‘స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం భాగంగా “ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్”మున్సిపల్ కమీషనర్ శ్రీ వి.వి. నరసింహా రెడ్డి

బద్వేల్  ప్రజావాణి న్యూస్) పురపాలక సంఘం పరిధిలో ‘స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం భాగంగా “ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్” అనే థీమ్ తో ఈరోజు పట్టణంలో కూరగాయల మార్కెట్ వద్ద నుండి ర్యాలీ నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో బద్వేల్ రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు బద్వేల్ పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్ శ్రీ ఏ.చంద్ర మోహన్, మున్సిపల్ కమీషనర్ శ్రీ వి.వి.నరసింహా రెడ్డి,బద్వేల్ తహసీల్దార్ ఎస్. పీర్ మున్ని ,బద్వేల్ పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీ రామక్రిష్ణ,ఎక్సైజ్ సీఐ శ్రీ సీతారాం, శ్రీ నయీమ్ ఇతర శాఖల ఉన్నత అధికారులు,మెప్మా మున్సిపల్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా పట్టణ ప్రజలు మరియు వ్యాపారస్తులు ప్లాస్టిక్ రహిత బద్వేల్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రతిజ్ఞ చేశారు.సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని సూచిస్తూ ప్రత్యామ్నాయంగా జనపనార సంచులు, గుడ్డ సంచులు మరియు స్టీల్ బాటిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించారు.పర్యావరణానికి మరియు మానవ ఆరోగ్యానికి హానికరమైన ప్లాస్టిక్ కవర్లు, కప్పుల వాడకాన్ని తగ్గించాలని కోరారు. తడి చెత్త, పొడి చెత్త, హానికర వ్యర్థాలు మరియు ఈ-వేస్ట్‌ను వేర్వేరుగా వర్గీకరించి  మున్సిపల్ వాహనాలకు అందించాలని సూచించారు.పురపాలక కార్యాలయం,బద్వేల్