prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 3:01 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బద్వేల్ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జిగా డీసీసీబీ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి నియామకం – నియోజకవర్గ వ్యాప్తంగా హర్షాతిరేకాలు!

బద్వేల్ (ప్రజావాణి జులై 11)నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో సరికొత్త రాజకీయ అధ్యాయం మొదలైంది కడప జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్‌గా సమర్థవంతమైన సేవలు అందిస్తున్న సీనియర్ నాయకులు శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారిని బద్వేల్ నియోజకవర్గ తెదేపా అధికారిక ఇన్ఛార్జిగా నియమిస్తూ పార్టీ అధిష్ఠానం సంచలన నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి,క్యాడర్‌లో నూతన ఉత్తేజం నింపడానికి ఈ నియామకం ఎంతగానో దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

చంద్రబాబు, లోకేష్‌ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా:

తన నియామకంపై మంచూరు సూర్యనారాయణ రెడ్డి స్పందిస్తూ.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాత్రింబగళ్లు శ్రమిస్తానని స్పష్టం చేశారు,బద్వేల్ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మార్చడమే తన ఏకైక లక్ష్యమని ఆయన ప్రకటించారు. ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను,అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి, ప్రజలకు మరింత చేరువవుతామని హామీ ఇచ్చారు.గత కొన్నేళ్లుగా డీసీసీబీ చైర్మన్‌గా ఉంటూ రైతుల, ప్రజల సమస్యలపై మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఎనలేని సేవలందించారు, చెక్కులను సైతం లబ్ధిదారుల ఇళ్ల వద్దకే స్వయంగా వెళ్లి అందజేస్తూ నిరంతరం ప్రజాసేవలో తరిస్తున్నారు [బద్వేల్ నియోజకవర్గం లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వారి ఇంటి వద్దకే వెళ్లి,ఇప్పుడు నియోజకవర్గ పూర్తిస్థాయి ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టడం ద్వారా బద్వేల్ ప్రాంత సమగ్ర అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగనున్నట్లు ఆయన వర్గీయులు తెలిపారు.మంచూరు సూర్యనారాయణ రెడ్డి నియామక వార్త తెలియగానే నియోజకవర్గంలోని బద్వేల్, గోపవరం, అట్లూరు, బి.కోడూరు, శ్రీ అవధూత కాశీనాయన, కలసపాడు, పోరుమామిళ్ల మండలాల్లోని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.టపాసులు కాలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.సరైన సమయంలో అధిష్ఠానం సరైన నాయకుడికి బాధ్యతలు అప్పగించిందని శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.మున్ముందు నియోజకవర్గంలోని సీనియర్ నేతలు, యువ నాయకత్వం మరియు ప్రతి ఒక్క కార్యకర్తను కలుపుకొని, అందరి సలహాలు, సూచనలతో సమష్టిగా పార్టీ విజయానికి కట్టుబడి పనిచేస్తామని మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు,