prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 5:47 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి తొలి విడతలు 500 కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే విధంగా తీర్మానం చేసి ముఖ్యమంత్రి పోవాలని సిపిఐజిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు

బద్వేల్ (న్యూస్ మే 26 ప్రజావాణి) మహానాడులో నియోజకవర్గ అభివృద్ధి కోసం 500 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని తీర్మానం చేయాలి2. అట్టహాసంగా జరుపుకుంటున్న మహానాడులో అభివృద్ధిపై చర్చ జరపాలి -సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ అధికార తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో పార్టీ సాధించిన ప్రగతి పై మహానాడులో అనేక తీర్మానాలు చేస్తారని అయితే పద్యంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో నియోజకవర్గ అభివృద్ధికి తొలి విడతలు 500 కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే విధంగా తీర్మానం చేసి ముఖ్యమంత్రి పోవాలని సిపిఐజిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు సోమవారం సిపిఐ బద్వేల్ ఏరియా కార్యవర్గ సభ్యుల సమావేశం ఇమ్మానియేల్ అధ్యక్షతన స్థానిక జేవీ భవనం నందు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.రెండు సంవత్సరాల పాలనలో అభివృద్ధి అటకెక్కిందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్రం అగ్నిగుండంలా మారుతున్న దరిమెల గ్రామీణ ప్రాంతాల్లో నీటి కష్టాలు తీవ్రమవుతున్నాయని సమస్యను పరిష్కరించి ప్రజల దాహార్తి తీర్చాలని పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని కానీ రాష్ట్ర ప్రభుత్వం పొదుపు మంత్రం పాటిస్తున్నదని కేంద్రం నుండి చేస్తున్న అప్పులు కేవలం కొన్ని ప్రాంతాల అభివృద్ధికి మాత్రమే కేటాయిస్తున్నారని దీని కారణంగా ప్రాంతి యఅసమానతలు పెరుగుతాయి అన్ని నియోజకవర్గాలను ఒకే దూర దృష్టితో చూడాలన్నారు బద్వేల్ నియోజకవర్గం గ్రామీణ పేదలు రైతులు వ్యవసాయ కూలీలు అధికంగా ఉన్న ప్రాంతమని నియోజకవర్గ అభివృద్ధికి 500 కోట్లు కేటాయిస్తే పట్టణ సుందరీకరణ ప్రభుత్వ విద్యాసంస్థలు వస్తాయని గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు నీళ్లు సౌకర్యం పెరుగుతాయని అందుకే జరుగుతున్న మహానాడు వారి అంతర్గత కార్యక్రమం అయినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి పైన చర్చలు జరిపి పలు తీర్మానాలు చేసి నివేదికను ముఖ్యమంత్రిగా దృష్టి తీసుకుపోయి నిధులు రాబట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ పట్టణ కార్యదర్శి పి బాలు ఏరియా సహాయ కార్యదర్శి పి.వి.రమణ కార్యవర్గ సభ్యులు పడిగే వెంకటరమణ జాకోబ్ విజయమ్మ సునీల్ నాగేష్ సఫా ఫిరోజ్, షాహిదా, సలోమి, జిఎల్ నరసింహ, శేషారెడ్డి,తదితరులు పాల్గొన్నారు