ఆ.నలుగురూ.తాడేపల్లిలో.మన ప్రియతమ నాయకులు.వైఎస్.జగన్మోహన్ రెడ్డి ని కలవడానికి వెళ్తే ,అక్కడ కనిపించేది ఆ నలుగురే.ఇడుపులపాయలో.జగన్ అన్న ఉన్నారని తెలిసిన వెంటనే ముందుగా అక్కడికి చేరేది.ఆ నలుగురే.కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన నాయకుని వెంట ఉండేది,ఆ నలుగురే.నియోజకవర్గానికి ఏ నాయకుడు వచ్చినా ముందువరుసలో గణపయ్యల మాదిరి ఎప్పుడు కనిపించేది ఆ నలుగురే.బద్వేల్ నియోజకవర్గంలో ఆ నలుగురు తప్ప మరెవ్వరూ నాయకులే లేరా.పార్టీ పటిష్టత కోసం.ఎండ అనకా.వాన అనగా. కష్టకాలంలో.ధైర్యంగా నిలిచిన నాయకులు,కార్యకర్తలు లేరా.బద్వేల్ నియోజకవర్గ వైయస్సార్సీపి నాయకులారా,కార్యకర్తలారా,ఒక్కసారి ఆలోచించండి,పార్టీ అనేది ఆ నలుగురిదే కాదు,వేలాది మంది కార్యకర్తలు,నాయకుల కటోరశ్రమతో నిలిచిన ఒక ఉద్యమం.నిజాయితీకి విలువ దక్కాలంటే,కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు,ప్రతి నాయకుడికి గుర్తింపు రావాలంటే ఇప్పుడైనా మనం ప్రశ్నించాలి.మన హక్కుల కోసం మనమే నిలబడాలి.పార్టీ బలంగా ఉండాలంటే ద్వితీయ శ్రేణి నాయకులు,కార్యకర్తలే ఆధారం.నాయకులను,కార్యకర్తలను విస్మరిస్తే పార్టీ బలహీన మౌతుంది.పార్టీలో అవకాశాలు సేవ ఆధారంగా రావాలా.లేదా పరిచయాల ఆధారంగానా.నాయకత్వం.ప్రజల మధ్య నుంచి రావాలా,లేదా గదుల్లో నిర్ణయించబడాలా,వైయస్సార్సీపి నాయకులారా.ఇది విమర్శగా కాదు ఒక హెచ్చరికగా తీసుకోండి.నాయకులను,కార్యకర్తలను దూరం చేస్తే పార్టీని ప్రజల నుంచి దూరం చేసినట్టే. ఆమె చరిత్ర చెబుతోంది.నాయకులను,కార్యకర్తలను పట్టించుకోని పార్టీలు ఎన్నికల ముందు కాదు,ఎన్నికల రోజే బలహీనపడతాయి.పార్టీ కార్యకర్తలలో నేటికీ ఒక స్పద్ధత రాలేదు.నియోజకవర్గ నాయకత్వ మార్పు జరగను లేదు .ఉన్న నాయకులలో మార్పు రానేలేదు.నియోజకవర్గo లో ఆ పార్టీ కార్యకర్తలలో నానాటికి పార్టీ నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లి పోతోంది.ఉన్న ఇద్దరు నాయకులు ఎడ మొహం పెడ మొహం వేసుకొని తిరుగుతూ ఉండడంతో కార్యకర్తలు ఎటు పోతే ఏమవుతుందో అనే సందిగ్ధంలో పడ్డారు.ఇటీవల పార్టీ పదవులన్నీ ఎమ్మెల్సీ వర్గానికే కేటాయిస్తూ ఉండడంతో అదనపు సమన్వయకర్త విశ్వనాధుని వర్గానికి ఏ ఒక్క పదవి కూడా ఇవ్వకపోవడంతో ఆ వర్గంలో నైరాస్యం నెలకొంది.పెత్తనం ఎమ్మెల్సీ వర్గానిది.పార్టీ ప్రతిష్టత కోసం అదనపు సమన్వయకర్త ఎంత కృషి చేస్తున్నప్పటికీ ఆయనకు అధిష్టాన వర్గం వద్ద రిక్త హస్తాలే ఎదురవుతున్నాయి.స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం పార్టీలో నాయకత్వ మార్పు ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ అది కనుచూపుమేరలో కూడా కనిపించడం లేదు.తానుఉండగా
తనను కాదని మరొక వర్గానికి నాయకత్వం కట్టబెట్టే సందర్భం రానివ్వనని ఎమ్మెల్సీ కరాకండిగా చెబుతున్నట్లు తెలుస్తోంది.విశ్వనాథుడు మాత్రం నియోజకవర్గమంతా సుడిగాలి పర్యటనలు చేసి పార్టీ బలోపేతానికి ఎంత కృషి చేసిన ఆయన కృషికి తగిన ఫలితం దక్కకపోవడంతో కేవలం శుభకార్యాలకు. అశుభ *కార్యాలకు హాజరు కావడం మినహా ఆయనకు ఒరిగిందేమీ లేదు. దీంతో పార్టీ అధిష్టాన వర్గంపై కొంత మేర కినుక వహించి ప్రస్తుతం ఆయన తన విత్తనాల వ్యాపారానికే పరిమితమైనట్లు తెలుస్తోంది. అప్పుడప్పుడు అడపా.దడపా.పెళ్లిళ్లకు.చావు కార్యక్రమాలకు హాజరవుతూ.తన వర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.మీకు నేను ఉన్నాను.నాకు అన్నీ తెలుసు.మీకు న్యాయం చేస్తాను.అని కార్యకర్తలకు భరోసానించుకుంటూ ఆయన వర్గాన్ని చేజారి పోకుండ కాపాడుకుంటున్నట్లు తెలుస్తోంది.
నియోజకవర్గంలో ఏ నాయకుడు పర్యటించిన (ఆదినాయకుడితో సహా) పై నలుగురే ముందు వర్షలో కనిపిస్తారు తప్ప మరొకరు కనిపించరు.ఆ నలుగురు కూడా ఎమ్మెల్సీ వర్గానికి చెందిన వారేనని అసమ్మతి వర్గ నాయకుల వాదన.ఇప్పటికైనా ఆ నలుగురిని పక్కన పెట్టి నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులతోపాటు కార్యకర్తలను కూడా వెంటబెట్టుకుంటే పార్టీ వైభవం మసక బారకుండా.ఉంటుందని, అలా కాని పక్షంలో పార్టీ మసక బారి పోయేందుకు ఎంతో దూరం లేదని ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు.కార్యకర్తలు.బాహాటంగా అనుకోవడం వినిపిస్తోంది..