బద్వేల్ టీడీపీ వర్గపోరుతో సీసీ రోడ్ల పనులు నిలిపివేత దురదృష్టకరం – తక్షణమే పనులు ప్రారంభించాలి: సీపీఐ

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) బద్వేల్ పట్టణంలో మంజూరైన 3 కోట్ల రూపాయల సీసీ రోడ్ల పనులు టీడీపీ నాయకుల వర్గపోరు కారణంగా నిలిచిపోవడం దురదృష్టకరమని, అధికారుల పర్యవేక్షణతో తక్షణమే పనులు ప్రారంభించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) పట్టణ సమితి ఆధ్వర్యంలో గురువారం ఆర్డీవో మరియు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ శ్రీ చంద్రమోహన్ గారికి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ మాట్లాడుతూ, బద్వేల్ పట్టణంలోని వివిధ వార్డులలో LSP, BPS కింద మంజూరైన 3...