బద్వేల్, కార్పొరేట్ స్థాయి విద్యాబోధన లక్ష్యంగా నాలుగు ఎకరాల్లో శ్రీ మారుతి విద్యా మందిర్ ప్రారంభం

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) బద్వేల్ పట్టణం బయనపల్లె సమీపంలోని శివరామ నగర్‌లో నాలుగు ఎకరాల విశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ మారుతి విద్యా మందిర్ ను కరస్పాండెంట్ బ్రహ్మానంద రెడ్డి దంపతులు గురువారం అట్టహాసంగా ప్రారంభించారు.1.సంకల్పం:బద్వేల్ చిన్న పట్టణమైనప్పటికీ ఈ ప్రాంత విద్యార్థినీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యాబోధనను అందించాలనే సంకల్పంతోనే ఈ పాఠశాలను నిర్మించామని బ్రహ్మానంద రెడ్డి గారు తెలిపారు.2.23 ఏళ్ల ప్రస్థానం:"23 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మా విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించి ఒక స్థాయిలో ఉన్నందుకు...