కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) బద్వేల్ పట్టణం బయనపల్లె సమీపంలోని శివరామ నగర్‌లో నాలుగు ఎకరాల విశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ మారుతి విద్యా మందిర్ ను కరస్పాండెంట్ బ్రహ్మానంద రెడ్డి దంపతులు గురువారం అట్టహాసంగా ప్రారంభించారు.1.సంకల్పం:బద్వేల్ చిన్న పట్టణమైనప్పటికీ ఈ ప్రాంత విద్యార్థినీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యాబోధనను అందించాలనే సంకల్పంతోనే ఈ పాఠశాలను నిర్మించామని బ్రహ్మానంద రెడ్డి గారు తెలిపారు.2.23 ఏళ్ల ప్రస్థానం:”23 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మా విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించి ఒక స్థాయిలో ఉన్నందుకు గర్వంగా ఉంది”అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.3. నూతన టెక్నాలజీ: నూతన టెక్నాలజీని విద్యార్థులకు పరిచయం చేస్తూ, సిటీ స్థాయి ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ ప్రాంత విద్యార్థులకు విద్యాబోధన అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.4.ప్రముఖుల హాజరు:ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా డీఎస్పీ పల్లెం శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై,బ్రహ్మానంద రెడ్డి విద్యా సేవలను కొనియాడారు.స్థానిక అతిరథ మహారథులు,విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన కృషిని అభినందించారు.జ్యోతి ప్రజ్వలన,వేద మంత్రాల నడుమ నూతన పాఠశాలను ప్రారంభించారు.యూకేజీ నుండి 10వ తరగతి వరకు,హాస్టల్ వసతితో పాటు AI టెక్నాలజీ క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ పాఠశాలను తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు తెలిపారు.ఇట్లుయాజమాన్యం,శ్రీ మారుతి విద్యా మందిర్ బద్వేల్