prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 2:45 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బద్వేలు రాఘవేంద్ర గ్రాండ్ లో “ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు” కార్యక్రమం ను నిర్వహించారు..

బద్వేల్ జూన్ 5 ప్రజావాణి రాష్ట్ ప్రభుత్వం ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం మరియు పాలనను ప్రజల ముంగిలికి తేవడమే లక్ష్యంగా “ఒక నెల-ఒక నియోజకవర్గం-నాలుగు పర్యటనలు” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.ఇందులో భాగంగా శుక్రవారం వై ఎస్ ఆర్ కడప జిల్లా.బద్వేలు రాఘవేంద్ర గ్రాండ్ లో “ఒక నెల ఒక నియోజకవర్గం-నాలుగు పర్యటనలు” కార్యక్రమం ను నిర్వహించారు.సమస్యలను విన్నవించు కోవడానికి వచ్చిన వారి నుండి అర్జీలను స్వీకరిస్తూ.సమస్యలను సావధానంగా వింటూ సమస్య పై సంబంధిత అధికారుల తో మాట్లాడి పరిష్కారం నిమిత్తం అధికారులకు ఆదేశాలు ఇస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి.మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ డా.నిధి మీనా.ఈ కార్యక్రమము లో డి సి సి బి చైర్మన్ సూర్య నారాయణ రెడ్డి,పాల్గొన్న వివిధ శాఖల జిల్లాఅధికారులు,ఆర్డిఓ చంద్ర మోహన్,బద్వేల్ నియోజక వర్గ తహసీల్దార్లు,ఆర్ఐలు,వి ఆర్ ఓ లు.అర్జీల నమోదు కొరకు మండలాల వారీగా ప్రత్యేక కౌంటర్ లు ఏర్పాటు చేసి అర్జీల నమోదు ప్రకియ జరుగుతున్నది.”ఒక నెల ఒక నియోజకవర్గం-నాలుగు పర్యటనలు” ముఖ్య ఉద్దేశ్యం:ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు ప్రతి నెలా ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి,అక్కడ నాలుగు పర్యటనలు (వారానికి ఒకటి చొప్పున) చేస్తారు.