prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 2:48 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బద్వేలు యువ నాయకులు చెరుకూరి రవి కుమార్ నాయుడు,,నారా చంద్రబాబు నాయుడు,ని మర్యాదపూర్వకంగా కలిశారు

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్16)బద్వేలు యువ నాయకులు చెరుకూరి రవి కుమార్ నాయుడు  కుటుంబ సమేతంగాగౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఈ నెల 20వ తేదీన జరగనున్న ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. పలు సేవా కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి గారికి వివరించారు.ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధత కల్పించి రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేసినందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనలో దూరదృష్టితో తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశంసించారు.అనంతరం బద్వేలు నియోజకవర్గ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సవివరంగా చర్చించి, ప్రజల ఆశలు-ఆకాంక్షలను వివరించారు. బద్వేలు సమగ్ర అభివృద్ధి కోసం త్వరితగతిన సరైన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రిని వినయపూర్వకంగా అభ్యర్థించారు.ఇదే సందర్భంలో బద్వేలు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన ముఖ్య అంశాలను పొందుపరిచిన వినతి పత్రాన్ని సమర్పించి, రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ మద్దతు అందించాలని కోరారు. ప్రజల సంక్షేమం, ప్రాంతీయ అభివృద్ధి పట్ల తమ కట్టుబాటును వ్యక్తం చేస్తూ, బద్వేలు ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తామని చెరుకూరి రవి కుమార్ నాయుడు గారు తెలిపారు.