బద్వేలు పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ

వైయస్సార్ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 24) బద్వేలు పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి,ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి,బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధమ్మ విచ్చేసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు,ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,అభిమానులు, పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి,ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి,ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధమ్మ మాట్లాడుతూ డాక్టర్...