prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 1:29 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బద్వేలు పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ

వైయస్సార్ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 24) బద్వేలు పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి,ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి,బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధమ్మ విచ్చేసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు,ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,అభిమానులు, పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి,ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి,ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధమ్మ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సమాజంలో సమానత్వం,సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడని కొనియాడారు.అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రజలకు సమాన హక్కులు కల్పించిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు.నేడు ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవిస్తూ రాజ్యాంగబద్ధ హక్కులను వినియోగించుకుంటున్నాడంటే అది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దూరదృష్టి ఫలితమని అన్నారు. ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని,సమానత్వ సమాజ నిర్మాణానికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.అనంతరం నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.కార్యక్రమం మొత్తం అంబేద్కర్ జయజయధ్వానాలతో, ప్రజల ఉత్సాహంతో ఎంతో వైభవంగా సాగింది