బద్వేలు నగరవనం ఘనంగా ప్రారంభం – ప్రజలకు ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన విహార కేంద్రం
బద్వేలు,జూలై 02ప్రజావాణి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో బద్వేలు పట్టణ ప్రజలకు ప్రకృతి సోయగాలను చేరువ చేస్తూ అభివృద్ధి చేసిన బద్వేలు నగరవనం నేడు ఘనంగా ప్రారంభించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీవో శ్రీ చంద్రమోహన్,డీసీసీబీ చైర్మన్ శ్రీ సూర్యనారాయణ రెడ్డి, వైఎస్సార్ జిల్లా అటవీ అధికారి శ్రీ రాజశేఖర్ బాబు హాజరై నగరవనాన్ని ప్రజలకు అంకితం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,పట్టణ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు నగరవనాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.ప్రతి ఒక్కరూ నగరవనాన్ని...