బక్రీద్ పండుగ సందర్భంగా మునుగోడ్ రోడ్డులోని ఈద్గా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించిన – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్
*బక్రీద్ పండుగ సందర్భంగా మునుగోడ్ రోడ్డులోని ఈద్గా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించిన - జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్* *నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* బక్రీద్ పండుగ ను పురస్కరించుకొని మునుగోడ్ రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద చేపట్టిన ఏర్పాట్లను నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు. ప్రార్థనలకు భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యే అవకాశమున్న నేపథ్యంలో భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సౌకర్యాలు, తాగునీరు, పరిశుభ్రత తదితర అంశాలపై సంబంధిత అధికారులకు పలు...