బక్రీద్ నేపథ్యంలో గోవధ నివారణ కు ప్రత్యేక చర్యలు అక్రమ గోవధ, పశువుల రవాణాపై ప్రత్యేక నిఘా శాఖల సమన్వయంతో కఠిన చర్యలు కమిషనర్ అలీం బాషా
మంగళగిరి (మే 20 ప్రజావాణి) తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గోవధ పై పూర్తిగా నిషేధం విధించినట్లు నగర పాలక సంస్థ కమిషనర్ అలీం బాషా స్పష్టం చేశారు. గోవధ నిషేధ చట్టాల అమలు, పశువుల అక్రమ రవాణా నివారణ, అనధికార వధ శాలల నియంత్రణపై బుధవారం కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.బక్రీద్ సందర్భంగా ఎటువంటి అక్రమ గోవధ కార్యకలాపాలు జరిగినా సహించబోమని కమిషనర్ హెచ్చరించారు.చట్టవిరుద్ధంగా గోవధ, అనుమతి లేని ప్రదేశాల్లో వధ, అక్రమ...