prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 2:08 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బక్రీద్ నేపథ్యంలో గోవధ నివారణ కు ప్రత్యేక చర్యలు అక్రమ గోవధ, పశువుల రవాణాపై ప్రత్యేక నిఘా శాఖల సమన్వయంతో కఠిన చర్యలు కమిషనర్ అలీం బాషా

మంగళగిరి (మే 20 ప్రజావాణి) తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గోవధ పై పూర్తిగా నిషేధం విధించినట్లు నగర పాలక సంస్థ కమిషనర్ అలీం బాషా స్పష్టం చేశారు. గోవధ నిషేధ చట్టాల అమలు, పశువుల అక్రమ రవాణా నివారణ, అనధికార వధ శాలల నియంత్రణపై బుధవారం కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.బక్రీద్ సందర్భంగా ఎటువంటి అక్రమ గోవధ కార్యకలాపాలు జరిగినా సహించబోమని కమిషనర్ హెచ్చరించారు.చట్టవిరుద్ధంగా గోవధ, అనుమతి లేని ప్రదేశాల్లో వధ, అక్రమ మాంస విక్రయాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.మున్సిపల్ సిబ్బంది, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కమిషనర్ అలీమ్ భాష ఆదేశించారు.ఈసమావేశంలో డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ గోవధకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలపై పోలీసు శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందన్నారు.రాత్రి వేళల్లో వాహనాల తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు అనుమానాస్పద ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపడతామని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మంగళగిరి, తాడేపల్లి తహసీల్దార్లు మాట్లాడుతూ రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ శాఖల సహకారంతో బక్రీదు పర్వదినాన్ని పురస్కరించుకొని గోవులు అక్రమ రవాణా, గోవధను అరికట్టేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పశువుల రవాణాకు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు.ప్రజలు కూడా గోవధ నిషేధ చట్టాల అమలుకు సహకరించాలని కోరారు. ఎక్కడైనా అనుమానాస్పదంగా పశువుల రవాణా లేదా అక్రమ గోవధ కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే పోలీసు లేదా మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే గోవధ నిర్మూలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తాడేపల్లి తాసిల్దార్ సీతారామయ్య అడిషనల్ కమిషన్ శకుంతల అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.