prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 9:01 am Digital Edition : SHEKARREDDY PATANCHERUV

బంధంకొమ్ము గాంధీ చౌక్ వద్ద రోడ్డు ప్రమాదం గుర్తుతెలియని పాదచారి మృతి

బంధంకొమ్ము గాంధీ చౌక్ వద్ద రోడ్డు ప్రమాదం.. గుర్తుతెలియని పాదచారి మృతి

అమీన్‌పూర్, జూలై 3 (ప్రజావాణి): అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ చౌక్ బంధంకొమ్ము వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి (వయస్సు సుమారు 50–55 సంవత్సరాలు) మృతి చెందాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మిట్యా తండాకు చెందిన రామావత్ అనిల్ (తండ్రి: రామావత్ శ్రీను) తన ఆటో TG13 T 8069ను అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపి పాదచారిని ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్ర తల గాయాలపాలైన బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మృతదేహాన్ని ప్రస్తుతం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడు గులాబీ రంగు ఫుల్ షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉండగా, ఎడమ చేతికి తెలుపు రంగు కడియం ఉంది. నలుపు-తెలుపు రంగుల గడ్డం కలిగి ఉన్నాడు.

మృతుడి వివరాలు తెలిసిన వారు వెంటనే అమీన్‌పూర్ పోలీసులను సంప్రదించాలని పోలీసులు కోరారు.

సంప్రదించవలసిన నంబర్లు:

ఎస్‌ఐ, అమీన్‌పూర్ సెల్: 8712581445

అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ సెల్: 8712661842