prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 8:31 am Digital Edition : RAKESH PEDDAPALLY

ఫ్యామిలీ రిజిస్టర్ తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.* 

 

ప్రజావాణి:

రేషన్‌ కార్డుల్లోని డేటా ఆధారంగా కుటుంబ రిజిస్టర్ సిద్ధం చేయనుంది. ప్రజలకు అవసరమైనప్పుడు మీ సేవ ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ ఇవ్వనున్నారు. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్‌ కేవలం కుటుంబ సభ్యుల వివరాల కోసమేనని, ఆస్తులపై హక్కులకు, లీగల్ హెయర్ నిర్ధారణకు ఉపయోగపడదని* ప్రభుత్వం స్పష్టం చేసింది.

రాష్ట్రంలో కుటుంబ రిజిస్టర్ రానుంది. ప్రభుత్వ పథకాలు, ఇతర అవసరాల కోసం కుటుంబ వివరాల ధ్రువీకరణకు ఇప్పటి వరకు సరైన రికార్డులు లేవు. లబ్ధిదారుల కుటుంబ సభ్యుల వివరాల కోసం వారు చెప్పిందే నమ్మాల్సి వస్తోంది. ప్రజలు తమ కుటుంబ సభ్యుల వివరాలతో అధికారిక సర్టిఫికెట్ పొందే అవకాశం లేదు. ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టేందుకు అధికారికంగా ఫ్యామిలీ రిజిస్టర్ తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఫ్యామిలీ రిజిస్టర్ కీలకంగా మారే అవకాశం ఉంది…ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, ఉత్తరాఖండ్, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాలు వివిధ పేర్లతో రాష్ట్ర స్థాయి కుటుంబాల డేటా బేస్ నిర్వహిస్తున్నాయి. కుటుంబ రిజిస్టర్‌ నిర్వహణ, ప్రజలకు సర్టిఫికెట్ ఇచ్చే బాధ్యతను సర్కార్ రెవెన్యూ శాఖకు అప్పగించింది. ఫ్యామిలీ రిజిస్టర్, సర్టిఫికెట్ల విధి విధానాలపై రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.