ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి–ఏబీవీపీ ఆధ్వర్యంలో బెజ్జంకి మండలంలో కళాశాలల బంద్ విజయవంతం

బెజ్జంకి,జూలై 14 (ప్రజావాణి) అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా బెజ్జంకి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం బెజ్జంకి మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో బంద్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంద వంశీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్‌లపై ఆధారపడి చదువుకుంటున్నారని, ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో రూ.11 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రతి...