ఫిర్యాదులను నిర్ణీత గడువు లోగా పరిష్కరించాలి – జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్
ప్రజావాణిన్యూస్(మార్చి23)కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్.పి గా బాధ్యతలు చేపట్టిన అనంతరం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమంలో జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు పాల్గొని, జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 92 ఫిర్యాదులు PGRS కు వచ్చాయి.ఈ సందర్భంగా ఎస్పీ గారు,ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్‌లో మాట్లాడారు....