ప్రజావాణిన్యూస్(మార్చి23)కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్.పి గా బాధ్యతలు చేపట్టిన అనంతరం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమంలో జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు పాల్గొని, జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 92 ఫిర్యాదులు PGRS కు వచ్చాయి.ఈ సందర్భంగా ఎస్పీ గారు,ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్‌లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. PGRS కార్యక్రమానికి విచ్చేసిన వృద్ధులు, దివ్యాంగుల వద్దకే జిల్లా ఎస్పీ గారు వెళ్లి ఫిర్యాదు లను స్వీకరించారు. చట్ట పరిధిలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.ఎస్పీ గారు పేర్కొన్న ముఖ్య అంశాలు;పోలీస్ శాఖ ద్వారా పరిష్కారం అయ్యే ప్రతి ఫిర్యాదును ప్రజలు స్వేచ్ఛగా మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాం.ప్రజల నుండి అందిన సదరు ఫిర్యాదులను నిర్ణీత సమయంలో చట్ట పరిధిలో పరిష్కరిస్తాం. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు తమ వినతులను విన్నవించుకున్నారు. వాటిపై సంబంధిత పోలీస్ అధికారులతో జిల్లా ఎస్.పి గారు నేరుగా మాట్లాడి సమస్యను చట్టపరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్ )శ్రీ కె. ప్రకాష్ బాబు గారు, మహిళా పి.ఎస్ డి.ఎస్.పి శ్రీ బాలస్వామి రెడ్డి గారు పాల్గొన్నారు.