ప్లాస్టిక్ వద్దు – స్టీల్ ముద్దు **గుగ్గిళ్లలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం**
బెజ్జంకి, జూన్ 5 (ప్రజావాణి) ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో "ప్లాస్టిక్ వద్దు – స్టీల్ ముద్దు" అనే అవగాహన కార్యక్రమాన్ని గ్రామ కార్యదర్శి వంశీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి వంశీ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే దుష్ప్రభావాలను గ్రామ ప్రజలకు వివరించారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించి, స్టీల్ పాత్రలు, గ్లాసులు వంటి పునర్వినియోగ వస్తువులను ఉపయోగించాలని సూచించారు. అలాగే వరి కొయ్యలను కాల్చడం వల్ల పొగ...