prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 1:04 pm Digital Edition : RAJASHEKARREDDY

ప్లాస్టిక్ వద్దు – స్టీల్ ముద్దు **గుగ్గిళ్లలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం**

బెజ్జంకి, జూన్ 5 (ప్రజావాణి)

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో “ప్లాస్టిక్ వద్దు – స్టీల్ ముద్దు” అనే అవగాహన కార్యక్రమాన్ని గ్రామ కార్యదర్శి వంశీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్యదర్శి వంశీ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే దుష్ప్రభావాలను గ్రామ ప్రజలకు వివరించారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించి, స్టీల్ పాత్రలు, గ్లాసులు వంటి పునర్వినియోగ వస్తువులను ఉపయోగించాలని సూచించారు. అలాగే వరి కొయ్యలను కాల్చడం వల్ల పొగ కాలుష్యం పెరిగి పర్యావరణానికి హాని కలుగుతుందని తెలిపారు.
ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల భూమి, నీరు, జీవజాలానికి కలిగే నష్టాలను వివరించి, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించారు. గుగ్గిళ్ల గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు తమ వంతు సహకారం అందిస్తామని గ్రామ ప్రజలు ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య, ఉపసర్పంచ్ దూగ్యాని లావణ్య-మోహన్, కొంకటి సంపత్, కొంకటి కుమార్, కొంకటి సురేష్, ర్యాకం అనిత, గుగ్గిళ్ల లావణ్య, సీత రేణుక, పోతు భూలక్ష్మి, దూశెట్టి రాజిరెడ్డి, అంగన్‌వాడీ టీచర్లు శోభ, భారతి, ఆశా వర్కర్లు రజిత, స్వప్న, కారోబార్ అశోక్, వీఓఏ సుంకరపల్లి లక్ష్మణ్, భాగ్య, గుగ్గిళ్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.