ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించిన ఘట్‌కేసర్ తహసీల్దార్ కార్యాలయం

ఘట్‌కేసర్, ఆగస్టు 6: తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా ఘట్‌కేసర్ తహసీల్దార్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఘట్‌కేసర్ తహసీల్దార్ చంద్రశేఖర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, కార్యాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి...