ప్రొద్దుటూరు మున్సిపల్ అధికారుల..ప్లాస్టిక్.. వేషాలు..పేదోడిపై ప్రతాపం.. బడా బాబులతో బేరసారాలు..! వసూళ్ల కోసమే..నిర్మూలన.. నాటకం..?

ప్రజావాణిన్యూస్(మార్చి24)ప్రొద్దుటూరుమున్సిపల్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందా. పర్యావరణ పరిరక్షణ పేరుతో అధికారులు ఆడుతున్న నాటకాలు చూస్తుంటే సామాన్య ప్రజలకు అసహ్యం వేస్తోంది.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ మహమ్మారిని అంతం చేయాలని కఠిన చట్టాలు తెస్తే,ఇక్కడి అధికారులు మాత్రం ఆ చట్టాన్ని తమ..వసూళ్ల దందా.కు పెట్టుబడిగా మార్చుకున్నారు. రెండు రోజుల హడావుడి,వందల ఫోటోలు, సోషల్ మీడియాలో పోస్టులు.ఇదంతా కేవలం ప్లాస్టిక్ మాఫియా నుంచి..అమ్యామ్యాలు.లాగేందుకేనన్న విమర్శలు ఇప్పుడు పట్టణమంతా గుప్పుమంటున్నాయి.చిరువ్యాపారుల ఉసురు పోసుకుంటున్న గూండా మనస్తత్వం.​రోడ్డు పక్కన తోపుడు బండిపై పండ్లు అమ్ముకునే వాడు,ఆకలి తీర్చే టిఫిన్ సెంటర్...