ప్రొద్దుటూరు పాత బస్టాండ్ వద్ద ..ఆటో.. అరాచకం..ప్రయాణికులపై రాక్షసత్వం.!

కడప జిల్లాప్రజావాణి న్యూస్ఏప్రిల్08)ప్రొద్దుటూరు  పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతం ప్రస్తుతం ప్రయాణికులకు ఒక నరకప్రాయంగా మారింది.ఒకవైపు భానుడి భగభగలు,మరోవైపు ఆటో డ్రైవర్ల ఆగడాలతో సామాన్య జనం అల్లాడిపోతున్నారు.నిబంధనలను తుంగలో తొక్కి, ఆర్టీసీ బస్సులను చుట్టుముడుతున్న ఆటోల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ప్రయాణికుల వస్తువులపై దౌర్జన్యం ఆర్టీసీ బస్సు స్టాండ్‌లోకి రాగానే కనీసం 15 నుంచి 20 ఆటోలు బస్సును చుట్టుముడుతున్నాయి.ప్రయాణికులు కిందికి దిగకముందే వారి చేతుల్లోని బ్యాగులను,సామాన్లను బలవంతంగా గుంజుకుంటూ తమ ఆటోల్లో వేసుకోవడం ఇక్కడ నిత్యకృత్యమైంది.ఈ క్రమంలో ఆటో డ్రైవర్ల మధ్య జరిగే...