ప్రొద్దుటూరులో..వడ్డీ..రాక్షసుల వికృత క్రీడ..పేద మహిళల రక్తం తాగుతున్న భీమవరం జలగలు..!

కడప జిల్లా ప్రొద్దుటూరులోప్రజావాణి న్యూస్ (మార్చి28) అమాయకత్వం వారి శాపం.పేదరికం వారి బలహీనత.అదే ఆ.నరరూప రాక్షసుల.కు పెట్టుబడి.సొంత ఊరు కాని ఊరు వచ్చి,కష్టజీవుల కన్నీటిని తాగుతూ,వారి రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్న దౌర్భాగ్యపు వడ్డీ మాఫియా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పడగవిప్పింది.భీమవరం ప్రాంతం నుంచి దిగుమతైన కొందరు.కేటుగాళ్లు.అప్పుల పేరుతో పేద మహిళల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారు.​సందు సందునా.వడ్డీ.మృగాలు.​ప్రొద్దుటూరులోని పెన్నా నగర్,ఈశ్వర్ రెడ్డి నగర్,అమృత నగర్, దొరసానిపల్లె, కాలేజీ రోడ్డు,కుమ్మరిగొట్టాల వీధి వంటి బడుగు,బలహీన వర్గాలు నివసించే ప్రాంతాలే ఈ ముఠాకు ప్రధాన అడ్డా.ఐదుగురు మహిళలను ఒక గ్రూపుగా...