prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 3:46 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ప్రొద్దుటూరులో..వడ్డీ..రాక్షసుల వికృత క్రీడ..పేద మహిళల రక్తం తాగుతున్న భీమవరం జలగలు..!

కడప జిల్లా ప్రొద్దుటూరులోప్రజావాణి న్యూస్ (మార్చి28) అమాయకత్వం వారి శాపం.పేదరికం వారి బలహీనత.అదే ఆ.నరరూప రాక్షసుల.కు పెట్టుబడి.సొంత ఊరు కాని ఊరు వచ్చి,కష్టజీవుల కన్నీటిని తాగుతూ,వారి రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్న దౌర్భాగ్యపు వడ్డీ మాఫియా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పడగవిప్పింది.భీమవరం ప్రాంతం నుంచి దిగుమతైన కొందరు.కేటుగాళ్లు.అప్పుల పేరుతో పేద మహిళల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారు.​సందు సందునా.వడ్డీ.మృగాలు.​ప్రొద్దుటూరులోని పెన్నా నగర్,ఈశ్వర్ రెడ్డి నగర్,అమృత నగర్, దొరసానిపల్లె, కాలేజీ రోడ్డు,కుమ్మరిగొట్టాల వీధి వంటి బడుగు,బలహీన వర్గాలు నివసించే ప్రాంతాలే ఈ ముఠాకు ప్రధాన అడ్డా.ఐదుగురు మహిళలను ఒక గ్రూపుగా చేర్చి,సాయం చేస్తున్నాం.అంటూ తేనెపూసిన మాటలతో వల విసురుతున్నారు.చదువు రాక,లెక్కలు తెలియక,పూట గడవని స్థితిలో ఉన్న పేద తల్లులను టార్గెట్ చేసి.చేతిలో పదివేలు పెట్టి, ప్రాణాలు తోడేస్తున్నారు.నూటికి 8 రూపాయల వడ్డీ.ఇది సహాయమా.సావుకా.ఒక గ్రూపుకు రూ.50 వేలు ఇస్తూ,వారానికి మనిషికి రూ.700 చొప్పున వసూలు చేస్తున్నారు.అంటే 20 వారాల్లో ఒక్కొక్కరి నుంచి ముక్కుపిండి వసూలు చేసేది అక్షరాలా భారీ మొత్తం.లెక్కలు వేసి చూస్తే నూటికి 8 రూపాయల వడ్డీ.ఇది కేవలం వడ్డీ వ్యాపారం కాదు,పేదవాడి పేగులు తెంచే క్రూరమైన దోపిడీ.దౌర్జన్యమే వారి భాష.ఒక్క వారం డబ్బు కట్టడం ఆలస్యమైతే చాలు.ఈ వడ్డీ మృగాలు నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ,మహిళలను మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.​అమాయకత్వమే ఆసరా.లెక్కలు అడిగితే.మళ్ళీ అప్పు ఇవ్వం.అంటూ బెదిరింపులకు దిగుతూ, నిరుపేదల బతుకులను బుగ్గిపాలు చేస్తున్నారు.​ఒక సారీ ఇటు చూడు పెద్దాయన.కాపాడండి ప్రొద్దుటూరు నాయకుల్లారా.​ఈ అరాచకం ఇంత బహిరంగంగా సాగుతున్నా పాలకులు,అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.ఈ దోపిడీని అరికట్టకపోతే ఆ పేద కుటుంబాలు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉంది.వెంటనే ఈ భీమవరం బ్యాచ్‌ను జిల్లా నుంచి తరిమికొట్టాలి.పేద మహిళల కష్టార్జితాన్ని లూటీ చేస్తున్న ఈ మృగాలను కఠినంగా శిక్షించాలి.ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ అక్రమ వడ్డీ వ్యాపారుల కోరల నుంచి పేదలను కాపా