ప్రొద్దుటూరులో నూతన డిసిసి బ్యాంక్ భవనాన్ని ప్రారంభించిన ఉమ్మడి కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 02) ప్రొద్దుటూరు నియోజకవర్గం మైదుకూరు రోడ్డులో,కొత్త ఆటో నగర్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన కడప జిల్లా సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (డీసీసీ బ్యాంక్) భవనాన్ని ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి,ప్రారంభించారు.ఇంతకుముందు మైదుకూరు రోడ్డులోని అన్వర్ థియేటర్ ఎదురుగా ఉన్న డీసీసీ బ్యాంక్ శాఖను,ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండే విధంగా కొత్త ఆటో నగర్ ఎదురుగా నూతన భవనానికి మార్చడం జరిగింది.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌ|| ముఖ్య అతిథిగా...