prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 7:29 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ప్రొద్దుటూరులో నూతన డిసిసి బ్యాంక్ భవనాన్ని ప్రారంభించిన ఉమ్మడి కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 02) ప్రొద్దుటూరు నియోజకవర్గం మైదుకూరు రోడ్డులో,కొత్త ఆటో నగర్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన కడప జిల్లా సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (డీసీసీ బ్యాంక్) భవనాన్ని ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి,ప్రారంభించారు.ఇంతకుముందు మైదుకూరు రోడ్డులోని అన్వర్ థియేటర్ ఎదురుగా ఉన్న డీసీసీ బ్యాంక్ శాఖను,ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండే విధంగా కొత్త ఆటో నగర్ ఎదురుగా నూతన భవనానికి మార్చడం జరిగింది.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌ|| ముఖ్య అతిథిగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శ్రీ నంద్యాల వరదరాజుల రెడ్డి.మరియు యువ నాయకులు శ్రీ నంద్యాల కొండారెడ్డి,పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారికి శాలువాతో ఘనంగా సత్కారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడిన డీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి,బ్యాంక్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం,సౌకర్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా నూతన భవనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు,మహిళా సంఘాలు మరియు ఖాతాదారులకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,బ్యాంక్ సిబ్బంది మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.