ప్రొద్దుటూరులో..నకిలీ..మృత్యుఘోష..కాసుల కక్కుర్తితో ఊపిరితిత్తుల దహనం..
ప్రొద్దుటూరులో మనిషి ప్రాణం కంటే ఆ వ్యాపారికి..నోట్ల కట్టలే..ముఖ్యం.చట్టం కళ్లుగప్పి,అధికారాన్ని అడ్డుపెట్టుకుని,సామాన్యుడి ప్రాణాలను బజారున పడేస్తున్నాడు ఆ అక్రమ సామ్రాజ్య చక్రవర్తి. ప్రొద్దుటూరు గాలిలో ఇప్పుడు స్వచ్ఛత లేదు. అంతా ఆ..నకిలీ..పొగ తెచ్చిన మృత్యు గంధమే!బ్రాండ్ పేరుతో..విషపు..విందు!ఒరిజినల్ సిగరెట్ ప్యాకెట్ రూ. 100 ఉంటే, అదే రూపంతో, అదే రంగుతో, కేవలం రూ. 20కే లభ్యమయ్యేలా నకిలీ మత్తును మార్కెట్లోకి వదులుతున్నాడు. చూడటానికి ఒరిజినల్ సిగరెట్లులా ఉండే ఆ నకిలీ సిగరెట్లు సామాన్యులు పీలుస్తూ.తమ ఊపిరితిత్తుల్లోకి నిలువునా విషాన్ని నింపుకుంటున్నారు.ఇదికేవలం వ్యాపారం కాదు,ఇది ఒక...