వైఎస్ఆర్ కడప జిల్లా,(మే25 ప్రజావాణి) ప్రొద్దుటూరు.పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ భూములు, మున్సిపల్ స్థలాలు కొందరి.ప్రైవేట్.. ఆస్తులుగా మారిపోతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మతలబు ఏంటి వైఎంఆర్ కాలనీలోని ఆంజనేయ స్వామి గుడికి ఎదురుగా జరుగుతున్న అక్రమాలే ఇందుకు నిదర్శనం. ప్రజలు పన్నులు కడుతుంటే, కొందరు మాత్రం మున్సిపల్ స్థలాలను ఆక్రమించి అద్దెల పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటున్నారు.అక్రమాల పునాదులు.. ఆక్రమణల భవనం వైఎంఆర్ కాలనీ ఆంజనేయ స్వామి గుడికి ఎదురుగా ఉన్న సుమారు 20 సెంట్ల విస్తీర్ణంలో.బండి సుబ్బయ్య శ్రీలక్ష్మి నిలయం పేరుతో ఉన్న భవనం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.6.5.1963లో ఈ నిర్మాణం జరిగినప్పుడు చుట్టూ ప్రహరీ గోడ ఉండేదని స్థానికులు చెబుతున్నారు.కానీ కాలక్రమేణా,మున్సిపల్ ల్యాండ్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న యజమానులు,మెయిన్ రోడ్డు వైపు ఉన్న సుమారు 6 మీటర్ల మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి, అడ్డదిడ్డంగా అంగళ్లను నిర్మించారు.ఇప్పుడు ఆ స్థలం మున్సిపాలిటీదా.లేక ప్రైవేట్ వ్యక్తులదా. అన్నది అధికారులకే తెలియాలి.మెడికల్ స్టోర్ యజమాని సాక్ష్యం.యటపడిన బాగోతం ఈ ఆక్రమణల గురించి అక్కడే ఉన్న.శ్రీ లక్ష్మీనారాయణ మెడికల్ స్టోర్.యజమానిని అడిగితే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.నేను అడిగాను అన్నా,ఇక్కడ రూములు అద్దెకు దొరుకుతాయా.ఆయన చెప్పాడు లేవన్నా,ఇక్కడ ఖాళీ లేవు.మళ్లీ అడిగాను సరే,ఇక్కడ అద్దె ఎంత ఉంటుంది. ఆయన చెప్పాడు రూ.5,000 అద్దె.నేను ఆశ్చర్యపోయి,అంత అద్దెనా అని అడగ్గా,ఆయన నవ్వుతూ నువ్వు ఏ కాలంలో ఉన్నావు. 15 ఏళ్ల క్రితమే మేము ఈ ధరకు ఇక్కడ అద్దెకు ఉన్నాము.మీరు ఇంకా 1,000, 1,500 అనుకుంటే ఎలా.అంటూ సమాధానమిచ్చారు.అంటే,దశాబ్దాలుగా మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి, ప్రజల సొమ్ముతో ఈ యజమానులు ఏటా లక్షల రూపాయల ఆదాయం గడిస్తున్నారన్నది స్పష్టమవుతోంది.రోడ్డు ఆక్రమణ.ట్రాఫిక్ మరణశాసనం.ఇక్కడ అన్యాయం కేవలం స్థలం ఆక్రమణతో ఆగలేదు. మున్సిపల్ కాలువను, సిసి రోడ్డును కూడా ఆక్రమించి,ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వాహనాలను అడ్డదిడ్డంగా నిలుపుతున్నారు.సాయిబాబా గుడికి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ అంతరాయం కలగడం వల్ల సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.అధికారులకి ఈ.అవినీతి.ఎందుకు కనిపించడం లేదు.మున్సిపాలిటీలో కొత్త పాలకమండలులు వస్తున్నా,కమిషనర్లు మారుతున్నా,ఈ ఆక్రమణదారుల దగ్గర నుంచి మున్సిపల్ ఆదాయం వసూలు చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారు.? రోడ్డుపై చిరువ్యాపారం చేసుకునే పేదవాడిని అడిగి మరీ రూ. 50 వసూలు చేసే అధికారులు, ఈ భారీ అక్రమ కట్టడాల యజమానిని ఎందుకు ప్రశ్నించడం లేదు.ఒక్కో రూముకు వేల రూపాయల అద్దె తీసుకుంటున్న యజమాని దగ్గర మున్సిపాలిటీ వసూలు చేస్తున్న పన్ను ఎంత
ప్రజా స్థలాన్ని ఆక్రమించి వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకునే దమ్ము మున్సిపల్ అధికారులకు లేదా.లేక,వీరి నుంచి వస్తున్న.నెలవారీ.. ముడుపులు అధికారుల కళ్లకు గంతలు కట్టాయా.
వైఎంఆర్ కాలనీ నివాసులు,బాధ్యతాయుతమైన పౌరులు కోరుతున్నది ఒక్కటే.వెంటనే మున్సిపల్ కమిషనర్ స్పందించి, ఆక్రమణలను తొలగించాలి. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచాలి. లేనిపక్షంలో,ఈ అక్రమాల వెనుక అధికారుల హస్తం ఉందని ప్రజలు నమ్మాల్సి వస్తుంది