ప్రొద్దుటూరులో..ఐఫోన్..మాయాజాలం.అక్రమార్కుల అడ్డాగా సెల్ పాయింట్ 1, C,సెల్ పాయింట్..అధికారులది కుంభకర్ణ నిద్ర..

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్20) ప్రొద్దుటూరులో.ఐఫోన్.మాయాజాలం.అక్రమార్కుల అడ్డాగా సెల్ పాయింట్ 1,C,సెల్ పాయింట్.అధికారులది కుంభకర్ణ నిద్ర.రెండవ ముంబైలో స్మగ్లింగ్ ఫోన్ల హల్చల్.కళ్లున్నా చూడలేని కబోదుల్లా పన్నుల శాఖ అధికారులు.నకిలీ మెరుపులు.ఆకర్షణీయమైన ఉచ్చు.బంగారు నగలకు,పట్టు వస్త్రాలకు పురిటిగడ్డ అయిన మన ప్రొద్దుటూరు,ఇప్పుడు విదేశీ దొంగచాటు చరవాణుల.స్మగ్లింగ్ మొబైల్స్‌.కు నిలయంగా మారుతోంది.ముఖ్యంగా యువత అమితంగా ఇష్టపడే.ఐఫోన్.లను ఎరగా చూపి సాగుతున్న ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది.అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.మార్కెట్లో కఠినమైన చట్టాలున్నా,అధికారుల అండదండలతో అక్రమార్కులు...