ప్రొద్దుటూరును మత్తు.మాఫియా.పంజా.సురేంద్ర నాధుడు అనే మత్తు పదార్థాల డాన్
కడపప్రజావాణిన్యూస్(మార్చి27) ప్రొద్దుటూరు.అంటే.అదొక ఆధ్యాత్మికతకు,వ్యాపార దక్షతకు మారుపేరైన ప్రొద్దుటూరు గడ్డపై ఇప్పుడు మరణ మృదంగం వినిపిస్తోంది.చెట్టుకు వెన్న పోసినా చేదు పోనట్లు.ఎన్ని చట్టాలు వచ్చినా,ఎంతటి నిఘా ఉన్నా.సురేంద్ర నాధుడు అనే మత్తు పదార్థాల డాన్ ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది.కేవలం కాసుల కక్కుర్తి కోసం సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతూ,ప్రొద్దుటూరు ఇంటింటికీ.క్యాన్సర్.అనే మహమ్మారిని పంపిణీ చేస్తున్నాడు ఈ అక్రమ వ్యాపారి.మత్తు చిమ్మే విషనాగు.క్యాన్సర్ కేరాఫ్ అడ్రస్ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.అంటారు పెద్దలు.కానీ.సురేంద్ర నాధుడు విక్రయించే ఈ నిషేధిత,నాసిరకం మత్తు పదార్థాలు నోటిని విషతుల్యం చేస్తున్నాయి.ఐదు రూపాయల మత్తు...