ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షిస్తాం కడప జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత

కడపజిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్10)ఖాజీపేటలో విద్యార్థిని బలిగొన్న ప్రేమోన్మాది ఘాతుకంపై జిల్లా ఇన్చార్జి మంత్రి,రాష్ట్ర బీసీ,ఈడబ్ల్యూఎస్ సంక్షేమ,చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.ఎంతో భవిష్యత్తు కలిగిన యువతి హత్యకు గురికావడం మనస్సును కలిచి వేస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు.నిందితుడు ఎంతటివాడైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని,చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మహిళలు,బాలికలపై పట్ల ఉన్మాదిలా వ్యవహరిస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు.ఈ మేరకు శుక్రవారం ఇన్చార్జి మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. పెళ్లి చేసుకోవాలంటూ,యువతి ఇంటికి వెళ్లి గొంతు కోయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.విచక్షణ మరిచి,ఎంతో...