prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 2:04 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షిస్తాం కడప జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత

కడపజిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్10)ఖాజీపేటలో విద్యార్థిని బలిగొన్న ప్రేమోన్మాది ఘాతుకంపై జిల్లా ఇన్చార్జి మంత్రి,రాష్ట్ర బీసీ,ఈడబ్ల్యూఎస్ సంక్షేమ,చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.ఎంతో భవిష్యత్తు కలిగిన యువతి హత్యకు గురికావడం మనస్సును కలిచి వేస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు.నిందితుడు ఎంతటివాడైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని,చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మహిళలు,బాలికలపై పట్ల ఉన్మాదిలా వ్యవహరిస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు.ఈ మేరకు శుక్రవారం ఇన్చార్జి మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. పెళ్లి చేసుకోవాలంటూ,యువతి ఇంటికి వెళ్లి గొంతు కోయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.విచక్షణ మరిచి,ఎంతో భవిష్యత్తు కలిగిన యువతిని బలి కొనడం దారుణమన్నారు.నిందితుడు శ్రీనివాస్ క్షమించరాని నేరం చేశాడన్నారు.ప్రేమోన్మాదికి చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామన్నారు.యువతి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేసిన మంత్రి సవిత,అండగా ఉంటామన్నారు.భవిష్యత్తులో మరెవరూ మహిళలు,బాలికల వైపు కన్నెత్తు చూడకుండా ఉండేలా చట్టపరంగా నిందితుడిని శిక్షిస్తామన్నారు. మహిళల పట్ల సైకోల్లా ప్రవర్తిస్తే వారికి అదే చివరి రోజని హెచ్చరించారు.యువత బాధ్యతతో మెలుగుతూ, డ్రగ్స్ కు,మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.మగ బిడ్డల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని,ఎప్పుడూ వారిపై ఓ కన్నేసి ఉంచాలని అన్నారు.నైతిక విలువలతో కూడిన జీవనం సాగించేలా చూడాలని మంత్రి సవిత సూచించారు.