prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 4:16 pm Digital Edition : RAJASHEKARREDDY

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాలిగ ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి

బెజ్జంకి,జూన్ 27 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి వైద్య సేవలను మెరుగుపరచాలని సిపిఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన సిపిఎం నాయకులు వైద్యాధికారితో సమస్యలపై చర్చించి రోగులతో మాట్లాడారు.24×7 PHCలో స్టాఫ్ నర్సులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. బెజ్జంకిలో 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడంతో పాటు రెండు PHCలకు రెండు 108 అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సంఘ ఎల్లయ్య, బొమ్మిడి సాయికృష్ణ, భోనగిరి లింగం తదితరులు పాల్గొన్నారు.