prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 1:49 pm Digital Edition : SRIKANTH MULUGU

ప్రాణం కాపాడే పాఠం నేర్చిన విద్యార్థులు

పసరా హైస్కూల్లో సి. పి. ఆర్. అవగాహన సదస్సు..

డీఎంహెచ్ఓ ప్రత్యక్ష ప్రదర్శన

పసర/ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి)

గోవిందరావుపేట మండలం
పసర గ్రామంలో సోమవారం నాడు జిల్లా వైద్య అధికారి సందర్శించారు. గుండె ఆగిన వెంటనే ప్రాణాలు కాపాడే సిపిఆర్ పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పసరా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సిపిఆర్ గురించి ప్రాక్టికల్‌గా వివరించి, విద్యార్థులతోనే స్వయంగా చేయించారు.

*సిపిఆర్ అంటే ఏమిటి?*

సదస్సులో డీఎంహెచ్ఓ మాట్లాడుతూ “సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్. గుండెపోటు, నీటిలో మునిగిపోవడం, కరెంట్ షాక్, ప్రమాదాల వల్ల ఎవరైనా అకస్మాత్తుగా కుప్పకూలినప్పుడు అంబులెన్స్ వచ్చేలోపు మొదటి 5 నిమిషాల్లో చేసే ప్రాథమిక చికిత్సయే సిపిఆర్”* అని వివరించారు.ఛాతిపై గట్టిగా, వేగంగా నొక్కడం ద్వారా గుండెకు రక్త ప్రసరణ జరుగుతుంది. సరైన సమయంలో సిపిఆర్ చేస్తే ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చు. ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన జీవరక్షణ విద్య” అని తెలిపారు.

*ప్రాక్టికల్‌గా నేర్పిన డీఎంహెచ్ఓ*

విద్యార్థుల ముందు డమ్మీపై సిపిఆర్ విధానాన్ని డీఎంహెచ్ఓ స్వయంగా చేసి చూపించారు. ఆ తర్వాత విద్యార్థులతో చేతులతో ఛాతి నొక్కడం, నోటి ద్వారా కృత్రిమ శ్వాస ఇవ్వడం వంటివి చేయించారు. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా నేర్చుకున్నారు.

*వర్షాకాల వ్యాధులపై కూడా అవగాహన*

ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల, పట్ల కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు.
“దోమల వల్ల వచ్చే డెంగ్యూ, మలేరియా, కలుషిత నీటి వల్ల వచ్చే టైఫాయిడ్, విరేచనాలను అరికట్టడానికి ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూడాలి. వేడి చేసిన నీరు తాగాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి” అని సూచించారు.ప్రతి విద్యార్థి తమ కుటుంబంలో తల్లిదండ్రులకు, తోటి మిత్రులకు సిపిఆర్ గురించి తప్పనిసరిగా తెలియజేయాలి. మీరు నేర్చుకున్న ఈ విద్యతో ఒక ప్రాణాన్ని కూడా కాపాడితే అదే అసలైన సేవ” అని డీఎంహెచ్ఓ విద్యార్థులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎన్ జీ ఓ మండల అధ్యక్షులు కళ్ళెం రవీందర్ రెడ్డి,
పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,సోమేశ్వరావు, రామరాజు, జ్యోతి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు డీఎంహెచ్ఓకు ధన్యవాదాలు తెలిపారు.