ప్రశ్నించేతత్వం లేని జర్నలిస్టుల వల్ల జర్నలిజం ప్రమాదంలో ఉన్నట్లే..
చిత్తూరు జిల్లా ప్రజావాణి (ఏప్రిల్28) వి.కోటలో ఆంధ్రజ్యోతి విలేకరి దారుణ హత్యపై తీవ్ర ఖండన వ్యక్తమవుతోంది.జర్నలిజం అంటే సమాజాన్ని సరిదిద్దే బాధ్యతతో ప్రతి చెడును ప్రశ్నించడం అని మనం ఎప్పటి నుంచో చెబుతున్నాం.కానీ అసలు ప్రశ్నించే తత్వం ఇప్పటికీ బతికే ఉందా అనే సందేహం కలుగుతోంది. చెడు వెనుక ఉన్న కారణాలను వెలికి తీయాలంటే ముందుగా ప్రశ్నించే ధైర్యం కావాలి.ఆ ధైర్యం ఎంతమందిలో ఉంది.నిజాయితీగా చూస్తే,ఈ తత్వం కొద్దిమందిలో మాత్రమే ఉందనిపిస్తోంది. ప్రశ్నించడమే జర్నలిజం ప్రాణం,సమాజంలో జరిగే అన్యాయాలు,అక్రమాలు,దోపిడీలు ఇవన్నీ జర్నలిస్టులకు బయటపెట్టే బలమైన...