చిలుకూరు ఫిబ్రవరి 24(ప్రజావాణి):చిలుకూరు మండలంలోని పాలే అన్నారం (నారాయణపురం)నకు చెందిన పనస గోవిందు వెన్నునొప్పి కారణంగా వైద్యుల సూచనల మేరకు రెండు రోజుల క్రితం ఈతకొట్టేందుకు చిలుకూరు హుజూర్ నగర్ ప్రధాన రహదారిలో ఉన్న ముక్త్యాల ఆర్కే మేజర్ కాలువకు వెళ్లాడు.కాలువ మెట్ల దగ్గర ఈత కొడుతున్న అతనిని ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు జారి కాలువల ప్రభావాన్ని కొట్టుకుపోయాడు.ఈతకు వెళ్లిన గోవిందు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పలుచోట్ల వెతికారు.అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళవారం చింతలపాలెం (మల్లారెడ్డి గూడెం) మేళ్లచెరువు సమీపంలో జోగుకుంటలో అతని మృతదేహాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మ్నతునికి భార్య,కుమార్తె,కుమారులు ఉన్నారు.శవపరీక్ష నిమిత్తం పోలీసులు గోవింద్ మ్నతదేహన్ని హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందరితో సఖ్యతగా తిరిగే గోవిందా ఆకాల మరణంపై సర్పంచ్ మండల జయమ్మ,ఉప సర్పంచ్ గండ్ర లింగస్వామి, మాజీ జిల్లా జడ్పీ కో ఆప్షన్ షేక్ జానిమియ,పలు పార్టీల నాయకులు,మిత్రులు, స్థానికులు సంతాపం వ్యక్తం చేశారు.