prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 1:35 pm Digital Edition : PRAJA VANI

ప్రమాదపు అంచుల్లో ఎన్ పి డి సి ఎల్ అధికారుల నిర్లక్ష్యం ప్రజావాణి వార్తకు స్పందన

*ప్రమాదపు అంచుల్లో… ఎన్ పి డి సి ఎల్ అధికారుల నిర్లక్ష్యం-ప్రజావాణి వార్తకు స్పందన!*

*స్పందించిన ఏ ఇ రమేష్ పూర్తి ఐన విద్యుత్ లైన్ పనులు*

వీర్నపల్లి జూలై 09 ప్రజావాణి: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని సామల్ల గడ్డ ఆర్ అండ్ బి రోడ్డు మూలమలుపు వద్ద 3 ఫెజ్ కరెంట్ సరఫరా అయ్యే వంగిన కరెంట్ పొల్ విషయమై జూన్ 30 వ తేదీన వెలువడిన  ప్రమాదపు అంచుల్లో… ఎన్ పి డి సి ఎల్ అధికారుల నిర్లక్ష్యం అనే ప్రజావాణి వార్త శీర్షికకు అధికారుల ను నుండి స్పందన వచ్చి తేది 09/07/2023 గురువారం రోజు ఎన్ పి డి సి ఎల్ అధికారులు ఏ ఇ రమేష్, కాంట్రాక్టర్ బిట్టు మూలమలుపు వద్ద నూతన కరెంట్ పొల్ వేసి ప్రజలకు రోడ్డున వెల్లే వాహన దారులకు విద్యుత్ ప్రమాదం జరుగకుండా పనులు పూర్తి చేయడం జరిగింది