ప్రమాదకర నీటి వనరుల వద్ద భద్రతా చర్యలు: సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపిఎస్ ఆదేశాలు..
సిద్దిపేట్, ఏప్రిల్ 20, ప్రజావాణి సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని, చెరువులు, కుంటలు, కాలువలు ఇతర నీటి వనరుల వద్ద ప్రమాదాలను నివారించేందుకు ప్రజల ప్రాణాలను రక్షించేందుకు సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల అనేక చోట్ల నీటి వనరుల వద్ద సరైన రక్షణ చర్యలు లేకపోవడం వల్ల ప్రమాదవశాత్తు నీటిలో పడి మరణిస్తున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.:ముఖ్యమైన ఆదేశాలు మరియుచర్యలు:కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు తమ పరిధిలోని...