సిద్దిపేట్, ఏప్రిల్ 20, ప్రజావాణి
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని, చెరువులు, కుంటలు, కాలువలు ఇతర నీటి వనరుల వద్ద ప్రమాదాలను నివారించేందుకు ప్రజల ప్రాణాలను రక్షించేందుకు సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల అనేక చోట్ల నీటి వనరుల వద్ద సరైన రక్షణ చర్యలు లేకపోవడం వల్ల ప్రమాదవశాత్తు నీటిలో పడి మరణిస్తున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.:ముఖ్యమైన ఆదేశాలు మరియుచర్యలు:కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు తమ పరిధిలోని ప్రమాదకరమైన నీటి ప్రాంతాలను గుర్తించి, ప్రమాదకరమైన చోట్ల స్పష్టంగా కనిపించే విధంగా ‘హెచ్చరిక బోర్డులు ‘డేంజర్ ఇండికేటర్లను’ ఏర్పాటు చేయాలని అదేశించారు.
బహిరంగంగా ఉన్న బావులు, లోతైన నీటి కుంటల చుట్టూ రక్షణ కంచెలు లేదా గోడలు నిర్మించేలాచర్యలుతీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు 10 రోజుల పాటు ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టనున్నారని తెలియజేశారు. స్థానిక ప్రజలకు, ముఖ్యంగా యువతకు పిల్లలకు నీటిభద్రతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. సిద్దిపేట పోలీసు శాఖచేపట్టిన ఈ భద్రతా చర్యలకు ప్రజలందరూ సహకరించాలని కోరడమైనది. ప్రమాదకరమైన నీటి ప్రాంతాల వద్దకు వెళ్లరాదని, ముఖ్యంగా పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ సూచించారు.