“ప్రమాదం జరిగితేనే మేల్కొంటారా..? ట్రాన్స్‌ఫార్మర్‌ల చుట్టూ ప్రహరీ లేక ప్రజల ప్రాణాలకు గ్యారంటీ ఎవరు!”
నేరేడుచర్లలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కొనసాగింపు – ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నేరేడుచర్ల(ప్రజావాణి): నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురం ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లకు ఇప్పటికీ రక్షణ కంచె (ఫెన్సింగ్) లేదా ప్రహరీ గోడ ఏర్పాటు చేయకపోవడంతో ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ప్రమాదం ముంచుకొస్తున్నా విద్యుత్ శాఖ అధికారులు స్పందించకపోవడం పట్ల స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి పక్కనే పూర్తిగా బహిరంగంగా ఉన్న ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్ద నుంచి ప్రతిరోజూ చిన్నారులు, వృద్ధులు, వాహనదారులు...